పాము కాటుతో రైతు మృతి | farmer dies of snake byte | Sakshi
Sakshi News home page

పాము కాటుతో రైతు మృతి

Aug 29 2017 10:48 PM | Updated on Oct 22 2018 2:22 PM

గౌరాజుపల్లికి చెందిన రైతు తిప్పారెడ్డి(45) పాముకాటుతో మంగళవారం మృతి చెందాడు.

రొద్దం: గౌరాజుపల్లికి చెందిన రైతు తిప్పారెడ్డి(45) పాముకాటుతో మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సోమవారం అర్ధరాత్రి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో తిప్పారెడ్డి పాముకాటుకు గురయ్యాడు.  మంగళవారం ఉదయం అపస్మారకస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులు పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆయన మృతి చెందినట్లు వివరించారు. మృతుడు తిప్పారెడ్డికి భార్య శకుంతలమ్మ, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement