విద్యుదాఘాతానికి యువరైతు బలి | farmer dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి యువరైతు బలి

Jan 20 2017 8:24 AM | Updated on Sep 5 2017 1:42 AM

అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి ఓ యువరైతు మృతి చెందాడు.

జగిత్యాల: అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం శానబండలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు(32) పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement