కరెంట్ షాక్ తగిలి రైతు మృతి | farmer death due to current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్ తగిలి రైతు మృతి

Jul 27 2016 8:47 AM | Updated on Oct 1 2018 4:01 PM

నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.  భూమా రమేశ్ మరణ వార్త తెలియగానే అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement