నకిలీ పోలీసుల అరెస్ట్‌ | fake policemen arrest | Sakshi
Sakshi News home page

నకిలీ పోలీసుల అరెస్ట్‌

Jul 25 2016 9:43 PM | Updated on Aug 11 2018 8:48 PM

ఏలూరు(ఆర్‌ఆర్‌ పేట) : మాదేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళను పోలీసులమని చెప్పి బెదిరించిన కేసులో నిందితులను రూరల్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

ఏలూరు(ఆర్‌ఆర్‌ పేట) : మాదేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళను పోలీసులమని చెప్పి బెదిరించిన కేసులో నిందితులను రూరల్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. రూరల్‌ ఎస్‌ఐ ఎం.వి.సుభాష్‌ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం మాదేపల్లి గ్రామానికి చెందిన ఈడా బుజ్జి స్థానిక ఆశ్రం ఆస్పత్రి వద్ద నిలుచుని ఉండగా నగరంలోని సుంకరవారి తోటకు చెందిన అన్నంరెడ్డి మురళీకష్ణ, వైఎస్సార్‌ కాలనీకి చెందిన పిల్లా హేమంత్, ఇందిరమ్మ కాలనీకి చెందిన కూనిశెట్టి దుర్గా ఆదిత్య తాము పోలీసులమని చెప్పి  ఆమె వద్ద నుంచి రూ.1500తో పాటు ఒక సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. దీంతో ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుల వివరాలు తెలిశాయని, సోమవారం వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement