500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం | excise raids | Sakshi
Sakshi News home page

500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

Jul 26 2016 1:59 AM | Updated on Sep 4 2017 6:14 AM

గజపతినగరం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని బొండపల్లి మండలం పనసలపాడు గ్రామంలో ఎక్సైజ్‌ అధికారులు సోమవారం దాడులు చేపట్టి సుమారు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

విజయనగరం రూరల్‌: గజపతినగరం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని బొండపల్లి మండలం పనసలపాడు గ్రామంలో ఎక్సైజ్‌ అధికారులు సోమవారం దాడులు చేపట్టి సుమారు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ వై. భీమ్‌రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నవోదయం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సారా తయారీ, విక్రయాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ లోకేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement