31 మద్యం బాటిళ్ల స్వాధీనం | excise police ride | Sakshi
Sakshi News home page

31 మద్యం బాటిళ్ల స్వాధీనం

Dec 9 2016 11:43 PM | Updated on Sep 5 2018 8:43 PM

చిలమత్తూరు మండలంలో బెల్టుషాపులపై దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 31 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

హిందూపురం రూరల్‌ : చిలమత్తూరు మండలంలో బెల్టుషాపులపై దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 31 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. డోరనాలపల్లిలో బెల్టుషాపు నిర్వహిస్తున్న పాపన్న వద్ద 10 మద్యం బాటిళ్లు,  నల్లరాళ్లపల్లిలో 10, చిలమత్తూరులో 11 బాటిళ్లు పట్టుకున్నట్టు వివరించారు. గ్రామాల్లో అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్‌ సీఐతో పాటు ఎస్‌ఐ రామన్న గౌడ్, కానిస్టేబుల్‌ వెంకటేషులు, గోపాల్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement