
ఏజెన్సీలో ఎక్సైజ్ దాడులు
పార్వతీపురం సబ్‌ప్లాన్‌లోని ఏజెన్సీ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం విస్తృత దాడులు జరిపారు.
పార్వతీపురం : పార్వతీపురం సబ్‌ప్లాన్‌లోని ఏజెన్సీ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం విస్తృత దాడులు జరిపారు. ఎక్సైజ్ సీఐ ఎస్.విజయకుమార్ ఆధ్వర్యంలో జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పార్వతీపురం తదితర మండలాల్లో జరిపిన దాడుల్లో జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామంలో బుదిరెడ్డి వేణుగోపాల నాయుడు ఇంట్లో నాటుసారా తయారీ కోసం నిల్వ ఉంచిన రెండు టన్నుల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తరలిస్తున్న ఓ మోటారు సైకిల్‌ను వశపరుచుకున్నారు.
ఈ నల్లబెల్లంతో సంబంధం ఉన్న రాయిపిల్లి రాజును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చినబుడ్డిడిలో నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్న ప్రధాన వ్యక్తులు రాయిపల్లి ఉమ, మండంగి గౌరీశంకర్, రాయిపిల్లి రమేష్, గంట మోహన్ తదితరులు పరారయ్యారన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజశేఖర్‌తోపాటు జిల్లాలోని ఆయా స్టేషన్ల పరిధిలోని ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.