‘ప్రతి దానికీ ఉద్యోగుల మీద నెపం వేయడం ప్రభుత్వానికి అలవాటైంది. మేము రాజధానికి వెళ్లడానికి రెడీగా ఉన్నాం..
ఉద్యోగుల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతి దానికీ ఉద్యోగుల మీద నెపం వేయడం ప్రభుత్వానికి అలవాటైంది. మేము రాజధానికి వెళ్లడానికి రెడీగా ఉన్నాం.. కానీ ఇప్పటికీ సచివాలయం భవనం ఎక్కడో చెప్పకుండా వెళ్లండంటూ ఒత్తిడి తెస్తూంటే ఎలా వెళ్తాం?’ అంటూ సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం, సాధారణ పరిపాలనశాఖ ఉద్యోగులు బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఫలానా భవనంలో సచివాలయ కార్యాలయం ఉంటుందని ఇప్పటివరకూ ప్రభుత్వం స్పష్టం చేయలేదన్నారు. సచివాలయ ఉద్యోగులను రాజధానికి తరలించాలంటే అందరినీ ఒకేసారి తరలించాలని, అన్ని శాఖలు ఒకే భవనంలో పనిచేసేలా ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్ధమని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.