మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ యువరైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.
విద్యుధ్ఘాతానికి యువరైతు బలి
Oct 16 2016 12:47 PM | Updated on Sep 5 2018 2:26 PM
వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ యువరైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా వెంకటాపురం మండలం మరికల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు(20) అనే యువరైతు వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


