అర్హులందరికీ ఉపాధి పనులు కల్పించాలి | dont neglet in upadhi | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఉపాధి పనులు కల్పించాలి

Jul 21 2016 4:43 PM | Updated on Sep 29 2018 6:11 PM

కావలిఅర్బన్‌: అర్హులైన వారందరికీ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డులు ఇచ్చి పనులు కల్పించాలని డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హరిత ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు, సిబ్బంతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

 
కావలిఅర్బన్‌: అర్హులైన వారందరికీ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డులు ఇచ్చి పనులు కల్పించాలని డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హరిత ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు, సిబ్బంతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని మండలాల అభివద్ధి పనులపై ఆరా తీశారు. పనుల్లో జాప్యం జరిగిన ప్రాంతాల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి కేటాయించిన వారందరి చేత జాబ్‌కార్డులకు దరఖాస్తులు చేయించాలన్నారు. కార్డులు తప్పకుండా ఇవ్వాలన్నారు. గ్రామ ప్రజలతో కలసి అభివద్ధికి అవసరమైన పనులను గుర్తించాలన్నారు. ఈ పథకంలో రైతులకు ఉపయోగపడే పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా నిర్ధేశించిన లక్ష్యాలను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు అవసరమైన సదుపాయాలు తప్పకుండా కల్పించాలన్నారు. ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మేట్లు ఎప్పటికప్పడు పనులను పర్యవేక్షిస్తూ కూలీలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కావలి క్లస్టర్‌ ఏపీడీ వెంకట్రావు, కావలి ఎంపీడీఓ ఎల్‌.జ్యోతి, అల్లూరు ఎంపీడీఓ కనకదుర్గా భవాని, బోగోలు, దగదర్తి ఎంపీడీఓలతో పాటు, ఏపీఓలు శ్యామల, శ్రీనివాసులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్, జూనియర్‌ మేట్లు, పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement