పర్యావరణానికి ముప్పు వాటిల్లేవిధంగా ఉన్న దివీస్ పరిశ్రమను తరలించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కోస్టల్ కారిడార్ మత్స్యకారుల సమావేశం జరిగింది. ముందుగా మధు మాట్లాడుతూ నవంబర్ 3న చలో దివిస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వామపక్షాలతో పాటు అన్ని రాజకీయపార్టీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
దివీస్ పరిశ్రమను తరలించాలి
Oct 31 2016 9:43 PM | Updated on Sep 28 2018 4:30 PM
కాకినాడ సిటీ :
పర్యావరణానికి ముప్పు వాటిల్లేవిధంగా ఉన్న దివీస్ పరిశ్రమను తరలించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కోస్టల్ కారిడార్ మత్స్యకారుల సమావేశం జరిగింది. ముందుగా మధు మాట్లాడుతూ నవంబర్ 3న చలో దివిస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వామపక్షాలతో పాటు అన్ని రాజకీయపార్టీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దివిస్ పరిశ్రమ వలన వేలాది మంది మత్స్యకారులు రోడ్డున పడతారని, మరొకసారి ప్రజాభిసేకరణ జరగాలన్నారు. ఈ నెల 9న సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేష¯ŒS కల్పించాలని కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు నక్కా కిషోర్, నాయకులు తోకల ప్రసాద్, అంజిబాబు, మాదవస్వామి, సూరయ్య పాల్గొన్నారు.
Advertisement


