గోడ కూలడంతో బావిలో పడి వ్యక్తి గల్లంతు | Displaced person lying on the bursting of the wall of the well | Sakshi
Sakshi News home page

గోడ కూలడంతో బావిలో పడి వ్యక్తి గల్లంతు

Sep 21 2016 11:39 PM | Updated on Sep 4 2017 2:24 PM

నాగలింగం(ఫైల్)

నాగలింగం(ఫైల్)

భారీ వర్షానికి గోడ కూలడంతో ఓ వ్యక్తి పక్కనే ఉన్న బావిలో పడి గల్లంతైన ఘటన పేట్‌ బషీరాబాద్‌ జరిగింది.

కుత్బుల్లాపూర్‌: భారీ వర్షానికి గోడ కూలడంతో ఓ వ్యక్తి పక్కనే ఉన్న బావిలో పడి గల్లంతైన ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ డి.వి.రంగారెడ్డి కథనం ప్రకారం...కొంపల్లి బిగ్‌బజార్‌ ముందు సర్వీసు రోడ్డులో అంజిరెడ్డి అనే వ్యక్తికి వ్యవసాయ బావి ఉంది.

అక్కడే ఉన్న ఓ గదిలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పెడికెట్‌ గ్రామానికి చెందిన గుండెం నాగలింగం(50) నివాసం ఉంటున్నాడు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా గది గోడ కూలి నాగలింగంపై పడగా..ఆయన పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. బావి పూర్తిగా నీటితో నిండిపోవడంతో, మోటార్లతో నీటిని తోడినప్పటికీ భారీ నీటి ప్రవాహం ఉండడంతో ఫలితం కన్పించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement