అమ్మనబోలు హైస్కూల్‌ తనిఖీ చేసిన డీఈఓ | DEO sudden verified school | Sakshi
Sakshi News home page

అమ్మనబోలు హైస్కూల్‌ తనిఖీ చేసిన డీఈఓ

Aug 27 2016 12:07 AM | Updated on Sep 15 2018 4:12 PM

పాఠశాలలో వార్షిక ప్రణాళికలు క్రమబద్ధంగా ఉండాలని డీఈఓ చంద్రమోహన్‌ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అమ్మనబోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నార్కట్‌పల్లి: పాఠశాలలో వార్షిక ప్రణాళికలు క్రమబద్ధంగా ఉండాలని డీఈఓ చంద్రమోహన్‌ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అమ్మనబోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  హాజరు రిజిస్టర్‌లను పరిశీలించి, హరితహారంలో నాటిన మొక్కలు, పాఠశాలలో మౌలిక వసతులు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య ఉన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement