కుంకుమార్చన టికెట్లకు డిమాండ్‌ | demand for kumkamarchana tickets | Sakshi
Sakshi News home page

కుంకుమార్చన టికెట్లకు డిమాండ్‌

Sep 22 2016 7:49 PM | Updated on Sep 4 2017 2:32 PM

కుంకుమార్చన టికెట్లకు డిమాండ్‌

కుంకుమార్చన టికెట్లకు డిమాండ్‌

దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారికి జరిగే కుంకుమార్చనలో పాల్గొనేందుకు ఉభయదాతలు పోటీ పడుతున్నారు. మూలా నక్షత్రం కుంకుమార్చన టికెట్లను గురువారం ఉదయం నుంచి కౌంటర్లలో అమ్మకానికి పెట్టగా, ఒక రోజులోనే దాదాపు రెండు బ్యాచ్‌లకు సంబంధించి పెద్ద ఎత్తున టికెట్లను భక్తులు కొన్నారు.

– మూలా నక్షత్రం రోజు కోసం ఉభయ దాతల పోటీ
– తొలి బ్యాచ్‌కు టికెట్లు నిల్‌
 
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : 
దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారికి జరిగే కుంకుమార్చనలో పాల్గొనేందుకు ఉభయదాతలు పోటీ పడుతున్నారు. మూలా నక్షత్రం కుంకుమార్చన టికెట్లను గురువారం ఉదయం నుంచి కౌంటర్లలో అమ్మకానికి పెట్టగా, ఒక రోజులోనే దాదాపు రెండు బ్యాచ్‌లకు సంబంధించి పెద్ద ఎత్తున టికెట్లను భక్తులు కొన్నారు. మొదటి బ్యాచ్‌ టికెట్ల కోసం ప్రముఖల నుంచి డిమాండ్‌ ఎక్కువగా రావడంతో దేవస్థాన అధికారులు ఆ బ్యాచ్‌ టికెట్ల విక్రయాలను నిలిపివేసి తమ వద్దే ఉంచారు. మూలా నక్షత్రం రోజు కుంకుమార్చనలో పాల్గొనేందుకు మంత్రులు, ప్రముఖులు, సినీ నటులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలోనే మొదటి బ్యాచ్‌ టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement