అభివృద్ధిలో యువత పాత్ర కీలకం | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

Published Sat, Oct 8 2016 12:52 AM

Crucial role in the development of youth

  •  
    కాజీపేట రూరల్ : ప్రపంచ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని వరంగల్‌ పీఠాధిపతి ఉడుముల బాల అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాస శిక్షణ కేంద్రంలో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ కథోళిక వ్యవసాయం,  గ్రామీణ ఉద్యమం (ప్రెంచ్‌ భాషలో మీజార్క్‌) సదఽస్సులను ఉడుముల బాల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకు ముందు ఉడుముల బాల మీజార్క్‌ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉడుముల బాల మాట్లాడుతూ మీజార్క్‌ అంతర్జాతీయ సదస్సులు ఓరుగల్లు నగరంలో నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. మీజార్క్‌ వరల్డ్‌ ప్రెసిడెంట్‌ కుమ్మరి కృష్ణాకర్‌ మాట్లాడుతూ 1954లో ప్రారంభమైన మీజార్క్‌లో 4 ఖండాల్లోని వివిధ దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. 18 వరకు జరిగే ఈ సదస్సులో ప్రపంచ దేశాల్లోని వాతావరణ మార్పులు, ఆకలిలేని ప్రపంచం, శాంతి, న్యాయం, పేదరిక నిర్మూలన, ఉపాధికి తగిన వేతనం, మంచి ఆరోగ్యం, విలువలతో కూడిన విద్య, స్వచ్ఛమైన తాగునీరు అనే అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. భీమారం మీజార్క్‌ యువత సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మీజార్క్‌ వరల్డ్‌ చాప్లిన్‌ ఫాదర్‌ ఒబినో, వరంగల్‌ నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్‌ మనోరంజన్‌, మీజార్క్‌ ప్రధాన కార్యదర్శి క్లేయర్‌, యూత్‌ డెలిగేట్‌ కేరళ కరోల్స్‌, మీజార్క్‌ ఆసియా ఖండం చాప్లిన్‌ ఫాదర్‌ మాథ్యూ, తెలుగు మీజార్క్‌ ప్రతినిధి దుంపాల బాలస్వామి, భారతమిత్ర డైరెక్టర్‌ ఫాదర్‌ ఐజక్‌, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement