కాంట్రాక్ట్ అధ్యాపకుల మౌన ప్రదర్శన
ఏఎన్‌యూ: యూనివర్సిటీల్లో చేపట్టనున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టటాన్ని నిరసిస్తూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఏఎన్‌యూ: యూనివర్సిటీల్లో చేపట్టనున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టటాన్ని నిరసిస్తూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని గాంధీ విగ్రహం నుంచి పరిపాలన భవన్ వరకు మౌన ప్రదర్శనగా వెళ్లి అక్కడ బైఠాయించారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ నియామకాల్లో నూతన విధానాలను ప్రవేశపెట్టే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పీ సుధాకర్ , డాక్టర్ డీ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ డీ రవిశంకర్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ కే కస్తూరి తదితరులు పాల్గొన్నారు.