ప్రేమించి పెళ్లాడి కాపురం చేసి పరారైన ఓ కానిస్టేబుల్ ఉదంతమిది.
భీమడోలుః
ప్రేమించి పెళ్లాడి కాపురం చేసి పరారైన ఓ కానిస్టేబుల్ ఉదంతమిది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు సమీపంలోని ఓఎన్‌జీసీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ధర్మవరానికి చెందిన ఎల్.రాజకుమార్ పోలసానిపల్లిలో నివాసముంటూ అదే గ్రామానికి చెందిన పుర్రి నాగలక్ష్మీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమెతో కొన్ని రోజుల పాటు కాపురం చేశాడు. అయితే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని రాజ్‌కుమార్ కొన్ని రోజుల క్రితం వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో నాగలక్ష్మీ రాజ్‌కుమార్‌కు ఫోన్ చేయగా తల్లిదండ్రులు తనకు మరో పెళ్లి చేస్తున్నారని, నీతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్టు బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా రూ.10లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు నాగలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.వెంకటేశ్వరరావు తెలిపారు.