నల్గొండ జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది.
మునగాల: నల్గొండ జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేరవుతున్న సారెడ్డి పాపిరెడ్డి(26) అనే యువకుడు రన్నింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. శనివారం నల్గొండలో జరగబోయే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు కసరత్తు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.