అక్టోబరు 21న పోలీసుల అమర వీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ‘స్మార్ట్ పోలీసింగ్’ అంశంపై జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
సంగారెడ్డి టౌన్: అక్టోబరు 21న పోలీసుల అమర వీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ‘స్మార్ట్ పోలీసింగ్’ అంశంపై జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫోటోగ్రఫీ, షార్ట్ వీడియో ఫిల్మ్ (పోలీసు శాఖ సేవలపై) చిత్రాలు, పోలీసు సేవ గురించి ప్రచురితమయిన ప్రత్యేక కథనాలను పాత్రికేయులు ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నం. 94409 01847లో సంప్రదించాలని సూచించారు.