కలెక్టర్‌ తీరు మార్చుకోవాలి | collector way is not correct | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ తీరు మార్చుకోవాలి

Oct 3 2016 11:14 PM | Updated on Mar 21 2019 8:35 PM

కలెక్టర్‌ తీరు మార్చుకోవాలి - Sakshi

కలెక్టర్‌ తీరు మార్చుకోవాలి

జర్నలిస్టుల పట్ల కలెక్టర్‌ విజయమోహన్‌ వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌కు కలెక్టర్‌ క్షమాపణ చెప్పాలి
– కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
 
కర్నూలు సిటీ: జర్నలిస్టుల పట్ల కలెక్టర్‌ విజయమోహన్‌ వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమం కవరేజికి వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ పట్ల కలెక్టర్‌ వ్యవహారించిన తీరుకు నిరసనగా సోమవారం ఫొటో, వీడియో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా కార్యక్రమ కవరేజికి వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ను కలెక్టర్‌ అవమానించడం తగదన్నారు.

వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులను కలెక్టర్‌ చిన్న చూపు చూస్తున్నారని, ఇలాంటి వైఖరి ఉన్న కలెక్టర్‌ జిల్లా చరిత్రలో ఎవరూ లేరని సీనియర్‌ జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి ఉన్నంత కాలం జిల్లా అభివద్ధికి నోచుకోదన్నారు. ఆందోళనలో ఏపీయుడబ్ల్యూజే, ఏపీయుడబ్యూఎఫ్, ఏపీజేఎఫ్‌ సంఘాలకు చెందిన జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement