అ అంటే అమరావతి అని భవిష్యత్తులో చదువుకునేలా రాజధాని నగరాన్ని తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
గుంటూరు: అ అంటే అమరావతి అని భవిష్యత్తులో చదువుకునేలా రాజధాని నగరాన్ని తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతికి ఒక పవిత్రత ఉంది, ప్రపంచంలోని అన్ని ప్రదేశాలు, పవిత్ర స్థలాల నుంచి మట్టిని, జలాలను తీసుకొచ్చామని అన్నారు. ప్రపంచంలోని 10 ఉన్నతమైన రాజధానిల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాజధానిలో నిర్మాణాలు చేపడతామన్నారు.
రాష్ట్ర పరిపాలన కోసం తరాలివొచ్చే అధికారులు, సిబ్బంది కోసం అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారని, ఈ విషయంలో కొంచెం ఆలోచించుకోవాలని స్థానిక ప్రజలను చంద్రబాబు కోరారు. రాజధాని విషయంలో తనకు ఎటువంటి స్వార్థం లేదని, రాష్ట్ర అభువృద్ధి కోసమే పాటుపడుతున్నానని చెప్పారు. ఒక సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టు తదితర నిర్మాణాలు చేపట్టి భవిష్యత్తుకు దిక్సుచిగా నిలపాలన్నదే తన ధేయామన్నారు. 2022 నాటికీ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికీ దేశంలో అగ్ర రాష్ట్రంగా, 2050 నాటికీ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపాలన్నది తన లక్ష్యమన్నారు.