చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జపాన్ బృందం | chandrababu naidu gets shock from Japan team | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జపాన్ బృందం

May 24 2016 11:54 AM | Updated on May 25 2018 7:04 PM

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జపాన్ బృందం - Sakshi

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జపాన్ బృందం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జపాన్ బృందం షాక్ ఇచ్చింది. తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో అయిదు నిమిషాలు కూడా సందర్శించకుండా ఆ బృందం వెళ్లిపోయింది.

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జపాన్ బృందం షాక్ ఇచ్చింది. తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో అయిదు నిమిషాలు కూడా సందర్శించకుండా ఆ బృందం వెళ్లిపోయింది. బస్సులో నుంచే నిర్మాణాలను చూసిన ఆ బృందం వెనుదిరిగింది. కాగా జపాన్ బృందం తాత్కాలిక సచివాలయాన్ని సందర్శిస్తుందంటూ ఎల్లో మీడియా మంగళవారం ఉదయం నుంచే హడావుడి చేసింది. అయితే బృంద సభ్యులు మాత్రం వెలగపూడిలో కనీసం బస్సు దిగి కూడా చూడలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేవరకూ కూడా జపాన్ బృందం అక్కడ వేచి చూడకుండానే వెళ్లిపోయింది. అనంతరం అక్కడకు వచ్చిన చంద్రబాబు... అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయ నిర్మాణ మ్యాప్ను పరిశీలించిన ఆయన, ఎప్పటికప్పుడూ నిర్మాణ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement