గురవయ్య తోటలో చైన్‌స్నాచింగ్‌ | chain snaching in prooddatur | Sakshi
Sakshi News home page

గురవయ్య తోటలో చైన్‌స్నాచింగ్‌

Jul 29 2016 11:30 PM | Updated on Sep 4 2017 6:57 AM

స్థానిక గురవయ్యతోటలో శుక్రవారం సాయంత్రం చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. రామసుబ్బమ్మ అనే వద్ధురాలు నేతాజినగర్‌లో నివాసం ఉంటోంది. ఆమె కూతురు వరలక్ష్మి ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో ఉంటోంది.

 ప్రొద్దుటూరు క్రై :
స్థానిక గురవయ్యతోటలో శుక్రవారం సాయంత్రం చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. రామసుబ్బమ్మ అనే వద్ధురాలు నేతాజినగర్‌లో నివాసం ఉంటోంది. ఆమె కూతురు వరలక్ష్మి ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం సాయంత్రం తన కూతురు వద్దకు నడుచుకుంటూ బయలుదేరింది. అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లగానే ఇద్దరు యువకులు మోటార్‌ బైక్‌లో వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. దుండగులు లాక్కొనే ప్రయత్నంలో వద్ధురాలు గొలుసును గట్టిగా పట్టుకోగా, ఆమె కింద పడిపోయింది. విషయం తెలియడంతో షీ టీమ్‌ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. బంగారు గొలుసు సుమారు 3.5 తులాలు ఉంటుందని రామసుబ్బమ్మ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement