
డైరెక్టర్ పదవిపై మోసం చేశారు: చదలవాడ
చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై తన అనుచరులు దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్పందించారు
తిరుపతి: చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై తన అనుచరులు దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్పందించారు. తాను ఎలాంటి దాడికి పాల్పడలేదని వివరణ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీలో తనకు 50శాతం వాటా ఉందని తెలిపారు. ఈ షుగర్ ఫ్యాక్టరీలో డైరెక్టర్ పదవి ఇస్తామని మోసం చేశారని ఆయన చెప్పారు. ఫ్యాక్టరీ యజమాని వినోద్‌బేడి మోసాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో రైతులకు న్యాయం చేయడానికి కృషి చేశానని అన్నారు.
ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై చదలవాడ కృష్ణమూర్తి అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి దాడి చేసినట్టు.. పోలీసులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేసు నమోదుకు లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు.