కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపరేవులలో సోమవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది.
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపరేవులలో సోమవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదంటూ భర్త నాగశేషుడు అత్తమామలపై దాడి చేశాడు. ఆ క్రమంలో బావ మరిది నాగరాజు జోక్యం చేసుకున్నాడు. దీంతో బావ నాగశేషుడు, బావమరిది నాగరాజు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అందులోభాగంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నాగశేషుడు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.