తెలంగాణలో తప్పు... ఆంధ్రాలో ఒప్పు! | bonda umamaheswara rao comments on party defection | Sakshi
Sakshi News home page

తెలంగాణలో తప్పు... ఆంధ్రాలో ఒప్పు!

Feb 23 2016 9:21 AM | Updated on Mar 22 2019 6:17 PM

తెలంగాణలో తప్పు... ఆంధ్రాలో ఒప్పు! - Sakshi

తెలంగాణలో తప్పు... ఆంధ్రాలో ఒప్పు!

తెలంగాణలో టీటీడీపీ నాయకులు అధికార కాంక్షతో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని, ఆంధ్రాలో మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాష్ట్రాభివృద్ధి కోరుతూ ప్రతిపక్ష నేతలు టీడీపీలోకి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు!

ఏపీలో అభివృద్ధి చూసి టీడీపీలోకి వస్తున్నారు
బోండా ఉమామహేశ్వరరావు వాఖ్యలు


తాడేపల్లి రూరల్: తెలంగాణలో టీటీడీపీ నాయకులు అధికార కాంక్షతో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని, ఆంధ్రాలో మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాష్ట్రాభివృద్ధి కోరుతూ ప్రతిపక్ష నేతలు టీడీపీలోకి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు! ఉండవల్లి అమరావతి కరకట్ట వద్ద ఉన్న సీఎం నివాసంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి వచ్చిన సందర్భంగా సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌లకు పదవులు ఇస్తామని ఆశ చూపించి టీడీపీ కండువా కప్పారా? అని విలేకరులు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పటికే టీడీపీలో ఎమ్మెల్యేల చేరికపై వ్యతిరేకత ప్రారంభమైందని విలేకరులు అనడంతో.. ఆయా జిల్లాల ఇన్‌చార్జిలతో చర్చించిన అనంతరమే ప్రతిపక్ష నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు బోండా చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement