ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌ | bike hits lorry | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

Sep 25 2016 10:19 PM | Updated on Sep 4 2017 2:58 PM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

కొవ్వూరు రూరల్‌: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన సంఘటన ఆదివారం కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద చోటు చేసుకుంది.

కొవ్వూరు రూరల్‌: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన సంఘటన ఆదివారం కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపల్లి గ్రామానికి చెందిన కేశవ, ఎం.ధనలక్ష్మి, ఎస్‌.కుమారి కొవ్వూరు వైపు నుంచి అనంతపల్లి మోటార్‌ సైకిల్‌పై వెళుతున్నారు. దొమ్మేరు గ్రామంలోని మసీదు సమీపంలోకి వచ్చేసరికి ముందుగా Ðð ళుతున్న వాహనాన్ని ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మార్జిన్‌లో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టారు. దీంతో వీరి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొవ్వూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement