పేదల ఇళ్లు తొలగిస్తే సీఎం ఫామ్‌హౌస్ ముట్టడి: భట్టి | Bhatti Vikramarka warning to KCR on Jawahar Nagar Colony Issue | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లు తొలగిస్తే సీఎం ఫామ్‌హౌస్ ముట్టడి: భట్టి

Jun 3 2016 12:53 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఒక్క పేదవాడి ఇల్లు తొలగించినా లక్షల మందితో కలసి ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు.

ఒక్క పేదవాడి ఇల్లు తొలగించినా లక్షల మందితో కలసి ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది.


 ఇక్కడి పేదల ఇళ్లను క్రమబద్దీకరించాలని, గ్రామ కంఠంగా ప్రకటించాలని కోరుతూ వార్డు సభ్యులు 24 రోజుల రిలే దీక్షల అనంతరం ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీనికి భట్టి విక్రమార్కతోపాటు జిల్లా నాయకులు శుక్రవారం మద్దతు పలికారు. ఈ సందర్భంగా భట్టి మట్లాడుతూ... తెలంగాణలో మళ్లీ దొరలపాలన వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబంలోని వారే రాజ్యమేలుతున్నారని వ్యాఖ్యానించారు. జవహర్‌నగర్ పంచాయతీలో రెండున్నర లక్షల మంది ఉన్నారని... ఒక్క పేదవాడి ఇల్లు తొలగించినా వీరందరితో కలసి కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement