జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 85 శాతం రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతన్ ముఖర్జీ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ హోటల్‌లో ఎస్‌బీహెచ్ బ్యాంకు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్ మీట్ నిర్వహించారు.
-
కస్టమర్ మీట్‌లో ఎస్‌బీహెచ్ ఎండీ సంతన్‌ముఖర్జీ
ఆదిలాబాద్ టౌన్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 85 శాతం రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతన్ ముఖర్జీ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ హోటల్‌లో ఎస్‌బీహెచ్ బ్యాంకు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్ మీట్ నిర్వహించారు. ఖాతాదారులకు, ఏఎస్పీకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతా దారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఖాతాదారులకు సేవ పరంగా ఏవైనా ఇబ్బందు తలెత్తుతే టోల్ ఫ్రీ నంబర్ 18004254055 కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అదేవిధంగా ప్రతి నెల 15న సంబంధిత బ్యాంకుల్లో ఖాతాల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. జీఎం మణికంఠన్, డీజీఎం బండారి, ఏజీఎం దుర్గాప్రసాద్, ప్రసాద్, రమణ, లీడ్ బ్యాంకు మేనేజర్ వినోద్ కుమార్ మధురే, ఖాతాదారులు పాల్గొన్నారు.