బాస్కెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక | basketball district teams selection | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

Apr 24 2017 12:41 AM | Updated on Sep 5 2017 9:31 AM

బాస్కెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

బాస్కెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

ఏలూరు రూరల్‌ : త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేష న్‌ కార్యదర్శి ఎంఎ న్‌ శ్రీనివాస్‌కుమార్‌ అన్నారు.

ఏలూరు రూరల్‌ : త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేష న్‌ కార్యదర్శి ఎంఎ న్‌ శ్రీనివాస్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఏలూరులోని ఏఎస్‌ఆర్‌  స్టేడియంలో జిల్లా బాస్కెట్‌బాల్‌ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు తాడేపల్లిగూడెం, మార్టేరు, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశారు.  త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పారు. అసోసియేష న్‌ కోశాధికారి కె.మురళీకకృష్ణ, గవ్వా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement