పార్లపల్లిలో స్థలంలో ముళ్లచెట్ల తొలగింపు విషయంపై జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు
వ్యక్తిపై గొడ్డలితో దాడి
Jan 22 2017 11:30 PM | Updated on Sep 5 2017 1:51 AM
ఎమ్మిగనూరు రూరల్ : పార్లపల్లిలో స్థలంలో ముళ్లచెట్ల తొలగింపు విషయంపై జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జమీర్ ఏడేళ్ల క్రితం ఖాళీ స్థలాన్ని కొన్నాడు. ఇతని స్థలం పక్కనే అదే గ్రామానికి చెందిన అబ్దుల్లా కూడా 6 నెలల క్రితం స్థలం కొన్నాడు. ఇద్దరి స్థలాల్లో మధ్య ఉన్న దారిలో ముళ్లచెట్లు పెరగడంతో వాటిని అబ్దుల్లా తొలగించాడు. తమ స్థలంలోని చెట్లను ఎలా తొలగిస్తామని జమీర్ అబ్దుల్లాను అడగగా మాటమాట పెరిగింది. జమీర్‌పై అబ్దుల్లా అతని కుమారులు దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement