విద్యార్థులను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కేసులు | Atrocity cases if students harassed | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కేసులు

Nov 11 2016 1:00 AM | Updated on Oct 20 2018 6:19 PM

విద్యార్థులను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కేసులు - Sakshi

విద్యార్థులను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కేసులు

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో స్కాలర్‌షిప్పులపై చదువుకునే పేద విద్యార్థులను కళాశాల నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుందని జేసీ 2 రాజ్‌కుమార్‌ హెచ్చరించారు.

 
  • జేసీ 2 రాజ్‌కుమార్‌
నెల్లూరు(సెంట్రల్‌):
జిల్లాలో స్కాలర్‌షిప్పులపై చదువుకునే పేద విద్యార్థులను కళాశాల నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుందని జేసీ 2 రాజ్‌కుమార్‌ హెచ్చరించారు. నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో గురువారం కళాశాల ప్రిన్సిపల్స్‌తో స్కాలర్‌షిప్పులపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు సంబంధిత శాఖకు హార్డ్‌కాపీలను ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు మాట్లాడుతూ స్కాలర్‌షిప్పులకు సరిపడా నగదు ఉందని హార్డ్‌కాపీలు ఇస్తే నగదు విడుదల చేస్తామని చెబుతున్నా ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావటం లేదన్నారు. హార్డ్‌కాపీలు ఇవ్వకుండా ఉండడమే కాకుండా విద్యార్థులు ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే ఎంత మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే వారికి సంబంధించిన హార్ట్‌కాపీలను సాంఘిక, బీసీ కార్యాలయానికి పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు  పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement