అమరాపురం(మడకశిర): అమరాపురంలోని సిండికేట్ బ్యాంకు ఏటీఎం మాయాజాలానికి ఖాతాదారుడు నష్టపోయారు. తన ఖాతా నుంచి మంగళవారం రూ.20 వేలు డ్రా చేయగా, రూ.18,500 మాత్రమే నగదు వచ్చిందని నజీర్ అహమ్మద్ అనే ఖాతాదారుడు ఆరోపించారు. వెంటనే విషయాన్ని సిండికేట్ బ్యాంకు మేనేజరును కలసి పరిస్థితిని వివరించినట్లు చెప్పారు.
ఏటీఎం మాయాజాలం
Apr 26 2017 12:20 AM | Updated on Sep 5 2017 9:40 AM
అమరాపురం(మడకశిర): అమరాపురంలోని సిండికేట్ బ్యాంకు ఏటీఎం మాయాజాలానికి ఖాతాదారుడు నష్టపోయారు. తన ఖాతా నుంచి మంగళవారం రూ.20 వేలు డ్రా చేయగా, రూ.18,500 మాత్రమే నగదు వచ్చిందని నజీర్ అహమ్మద్ అనే ఖాతాదారుడు ఆరోపించారు. వెంటనే విషయాన్ని సిండికేట్ బ్యాంకు మేనేజరును కలసి పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. చూస్తానంటూ అతను సాయంత్రం వరకు తనను బ్యాంకులోనే కూర్చోబెట్టుకుని.. ఆ తరువాత ఖాతా సక్రమంగానే ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
Advertisement
Advertisement