గద్వాల : ‘జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా గద్వాలకు న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్‌లో ఈ పేరు లేకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడతాం..’ అని ఎమ్మెల్యే డీకేఅరుణ హెచ్చరించారు. శుక్రవారం గద్వాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జోగుళాంబ జిల్లా చేయాలని డిమాండ్ చేశారు.
గద్వాల జిల్లా చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష
Aug 19 2016 11:13 PM | Updated on Sep 4 2017 9:58 AM
గద్వాల : ‘జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా గద్వాలకు న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్‌లో ఈ పేరు లేకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడతాం..’ అని ఎమ్మెల్యే డీకేఅరుణ హెచ్చరించారు. శుక్రవారం గద్వాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జోగుళాంబ జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. అర్హతలను బట్టి కాకుండా రాజకీయంగా జిల్లాలను ఏర్పాటుచేస్తే ప్రజావ్యతిరేకత తప్పదన్నారు. జిల్లాల ఏర్పాటులో సీఎం కేసీఆర్‌ను కొందరు నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వీటిని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గడ్డం కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బంద్ విజయవంతం
గద్వాల జిల్లా సాధన కోసం అఖిలపక్ష నాయకులు చేపట్టిన గద్వాల బంద్ విజయవంతమైంది. శుక్రవారం పట్టణంలో దుకాణాలు, సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. పుష్కర భక్తులను దష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇచ్చారు. ముందుగా ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. బస్సుల రాకపోకలపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని డ్యాం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement