ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా కడపలో జరుగుతున్న అండర్–19 బాలుర క్రికెట్ పోటీల్లో అనంత బ్యాట్స్‌మెన్లు సెంచరీలతో కదం తొక్కారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా కడపలో జరుగుతున్న అండర్–19 బాలుర క్రికెట్ పోటీల్లో అనంత బ్యాట్స్‌మెన్లు సెంచరీలతో కదం తొక్కారు. శుక్రవారం 176 పరుగులకు 6 వికెట్ల స్కోరు వద్ద రెండవ రోజు ఆటను ప్రారంభించిన అనంత జట్టు క్రీడాకారులు ప్రవీణ్‌కుమార్, సంపత్‌కుమార్‌లు సెంచరీలు చేయడంతో అనంత జట్టు 402 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
జట్టులో సంపత్‌కుమార్ 184 పరుగులతో రాణించగా, ప్రవీణ్‌కుమార్ 110 పరుగులు సాధించాడు. అనంతరం తన రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైఎస్సార్ జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 105 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 141 పరుగులకు ఆలౌటైంది. అనంతపురం జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులతో ఆధిక్యతను నిలుపుకుంది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైఎస్సార్ జిల్లా జట్టు 105 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.