గుర్తుతెలియని వ్యక్తి హత్య | An unknown person killed | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి హత్య

Apr 18 2017 12:12 AM | Updated on Jul 30 2018 8:37 PM

గుర్తుతెలియని వ్యక్తి హత్య - Sakshi

గుర్తుతెలియని వ్యక్తి హత్య

పట్టణంలోని సిద్దయ్యగుట్టలో పాడుబడిన ఓ పాఠశాల గదిలో 48 ఏళ్ల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

ధర్మవరం అర్బన్ : పట్టణంలోని సిద్దయ్యగుట్టలో పాడుబడిన ఓ పాఠశాల గదిలో 48 ఏళ్ల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పాడుబడిన పాఠశాల గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా గుర్తుతెలియని వ్యక్తి శవమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారంరోజుల క్రితం చనిపోయి ఉండటంతో శరీరం దుర్వాసన వస్తోంది. నుదుటిపై, కాళ్లపై గాయాలున్నాయి. హత్య చేసిన అనంతరం యాసిడ్‌ పోసి శరీరాన్ని కాల్చినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement