ఎన్జీరంగా వర్సిటీని సందర్శించిన అమెరికన్ బృందం | Sakshi
Sakshi News home page

ఎన్జీరంగా వర్సిటీని సందర్శించిన అమెరికన్ బృందం

Published Sat, Jan 2 2016 6:23 PM

american university team visited to ng ranga university

రాజేంద్రనగర్: అమెరికాకు చెందిన విస్‌కాన్‌సిన్ విశ్వవిద్యాలయం అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ బృందం శనివారం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. బృందం ప్రతినిధులు.. అగ్రిబిజినెస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎ.రామిరెడ్డి, ఉపకులపతి డాక్టర్ ఎ.పద్మరాజుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఎన్జీరంగా వర్సిటీలోని ఎంఏబీఎం విద్యార్థులకు విస్‌కాన్‌సిన్ వర్సిటీ అధ్యాపకులు ప్రసంగాలు ఇవ్వడంపై చర్చించారు.అగ్రిబిజినెస్‌పై విద్యార్థులలో నైపుణ్యం పెంపుపై సహకరించుకోవాలని అవగాహనకు వచ్చారు. రెండు వర్సిటీల పరస్పర సహకారానికి చర్చలు సానుకూలంగా జరిగాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement