'మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే' | ambati rambabu slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే'

May 18 2016 3:44 PM | Updated on May 25 2018 7:29 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎలాంటి హామీ తీసుకరాలేదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఏపీ నూతన రాజధాని పేరుతోనూ చంద్రబాబు భూ స్కాంకు పాల్పడ్డారంటూ దుయ్యబట్టారు.

ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. స్క్వేర్‌ ఫీట్‌కు రూ. 3,500లు ఇచ్చి ఎల్‌అండ్‌టీతో తాత్కాలిక రాజధాని కట్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలోనూ చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement