రాయపాటిని పరామర్శించిన అంబటి, మేరుగ | ambati meet rayapati | Sakshi
Sakshi News home page

రాయపాటిని పరామర్శించిన అంబటి, మేరుగ

Jul 19 2016 10:13 PM | Updated on Sep 4 2017 5:19 AM

రాయపాటిని పరామర్శించిన అంబటి, మేరుగ

రాయపాటిని పరామర్శించిన అంబటి, మేరుగ

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి చిత్రపటం వద్ద వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం నివాళులర్పించారు.

గుంటూరు(నగరంపాలెం):
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి చిత్రపటం వద్ద వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం నివాళులర్పించారు. గుంటూరు లక్ష్మీపురంలోని రాయపాటి నివాసానికి వెళ్లి పలువురు నాయకులు పరామర్శించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగర్జున తదితరులు లీలాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఎంపీ రాయపాటి సాంబశివరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ ఐజీ ఏసురత్నం, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్, రిటైర్డు ఐజీ సీఆర్‌ నాయుడు, రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ రాంప్రసాద్, డాక్టర్‌ మండవ శ్రీనివాస్‌ తదితరులు రాయపాటిని పరామర్శించినవారిలో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement