రాష్ట్ర స్థాయి స్కౌట్స్ లాలెంట్ పోటీల్లో ఆలేరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా స్కౌట్స్ పెట్రోల్ ఎస్కార్ట్ మాస్టర్, ఆలేరు పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్తూరి నర్సయ్య తెలిపారు.
రాష్ట్ర స్థాయి స్కౌట్స్ టాలెంట్ పోటీల్లో ఆలేరు విద్యార్థుల ప్రతిభ
Sep 26 2016 12:06 AM | Updated on Sep 15 2018 8:00 PM
ఆలేరు (నెల్లికుదురు) : రాష్ట్ర స్థాయి స్కౌట్స్ లాలెంట్ పోటీల్లో ఆలేరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా స్కౌట్స్ పెట్రోల్ ఎస్కార్ట్ మాస్టర్, ఆలేరు పాఠశాల ఉపాధ్యాయు డు ఎల్తూరి నర్సయ్య తెలిపారు. హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఈనెల 19 నుంచి 23 వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మండలకేంద్రంలో ఆదివారం విలేకరు ల సమావేశంలో వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లా తరఫున ఎనిమిది మంది ఎంపిక కాగా ఆలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బానోతు జీవన్, షేక్ జహీర్, నిమ్మ గోపికృష్ణ, బానోత్ దేవేందర్ పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేన్ రాష్ట్ర సెక్రటరీ చంద్రశేఖర్, లీడర్ ఆఫ్ ది కోర్స్ పరమేశ్వర్, జా¯న్సామ్యూల్ చేతులమీదుగా బహుమతులు అందుకున్నట్లు తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్, ట్రైనింగ్ కమిషనర్ రామమౌళి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, ఎస్‌ఎంసీ చైర్మన్ బోజ్యానాయక్ అభినందించారు.
Advertisement
Advertisement