డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు | A person prisoned in drunk and drive case | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు

Aug 27 2016 12:27 AM | Updated on May 25 2018 2:06 PM

మద్యం తాగి వాహనాన్ని నడిపిన డ్రైవర్‌కు జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట మున్సిఫ్‌ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు

చిట్యాల: మద్యం తాగి వాహనాన్ని నడిపిన డ్రైవర్‌కు జరిమానాతో పాటు ఐదు రోజుల   జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట మున్సిఫ్‌ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు చెప్పినట్టు  ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. వివరాలు.. చిట్యాల పట్టణం జాతీయ రహదారిపై గురువారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను స్థానిక పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నాగపూర్‌ వైపునకు లారీలో లోడుతో వెళుతున్న డ్రైవర్‌ అక్బర్‌ మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. ఇతని వెంటనే అదుపులోకి తీసుకుని రామన్నపేట మున్సిఫ్‌ కోర్టులో హాజరుపరిచారు. అక్బర్‌పై నేరం నిరూపణ కావడంతో రూ. రెండు వేల జరిమానాతో పాటు ఐదు రోజుల  జైలు శిక్ష విధించారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో జరిమానాతో పాటు జైలు శిక్ష విధించినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement