కూలిన చర్చి స్లాబ్: ఐదుగురి పరిస్థితి విషమం | 5 persons condition is reportdly serious at church collapsed in bhimavaram | Sakshi
Sakshi News home page

కూలిన చర్చి స్లాబ్: ఐదుగురి పరిస్థితి విషమం

Jan 8 2016 3:49 PM | Updated on Sep 3 2017 3:19 PM

కూలిన చర్చి స్లాబ్: ఐదుగురి పరిస్థితి విషమం

కూలిన చర్చి స్లాబ్: ఐదుగురి పరిస్థితి విషమం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్మాణ దశలో ఉన్న ఓ చర్చి కూలడంతో స్థానికంగా అలజడి రేగింది.

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండల కేంద్రంలోని గెస్ట్‌హౌస్ రోడ్డులో నిర్మాణ దశలో ఉన్న చర్చి భవనం స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 20 మంది గాయపడగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మున్సిపల్, అగ్నిమాపక, పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

తొలుత స్థానికంగా ఉన్నవారు కూడా సహాయక చర్యల్లో పాల్గొని  శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే యత్నం చేశారు. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement