చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి | 2 children died in nizamabad district | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

Jul 9 2016 10:58 AM | Updated on Sep 17 2018 8:02 PM

చెరువలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో శనివారం వెలుగు చూసింది.

కోటగిరి: చెరువలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో శనివారం వెలుగు చూసింది. స్థానిక దామర చెరువులో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు అందులో మునిగి పోయారు. రంజాన్ సందర్భంగా కోటగిరిలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చిన సోహెల్(11), సోని(9) శుక్రవారం చెరువు దగ్గరకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా.. చెరువులో రెండు మృత దేహాలు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement