పోస్టాఫీసుల్లో రూ. 1.40 కోట్ల మార్పిడి | 1.40cr exchange in post offices | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల్లో రూ. 1.40 కోట్ల మార్పిడి

Nov 14 2016 12:08 AM | Updated on Sep 4 2017 8:01 PM

పోస్టాఫీసుల ద్వారా డివిజన్‌ పరిధిలో ఆదివారం రూ. 1.40 కోట్ల మేరకు నోట్లు మార్పిడి చేసినట్లు పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ సి.హెచ్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసుల ద్వారా డివిజన్‌ పరిధిలో ఆదివారం రూ. 1.40 కోట్ల మేరకు నోట్లు మార్పిడి చేసినట్లు పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ సి.హెచ్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క హెడ్‌ పోస్టాఫీసులోనే రూ. 40 లక్షల మేరకు మార్పిడి చేశామన్నారు. సోమవారం గురునానక్‌ జయంతి సెలవు దినమైనా పోస్టాఫీసులు పనిచేస్తాయన్నారు. ఆదివారం ఎస్‌బీ ఖాతాలకు రూ. 4.79 కోట్ల డిపాజిట్లు జమ కావడంతో మొత్తం డిపాజిట్లు రూ. 35 కోట్లకు చేరాయని వివరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement