
ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురి
పార్వతీపురం: గోలురంగు తాగి ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. పార్వతపురం అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు...జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన రాయిపల్లి మాధురి సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఇంటిలో ఉన్న గోలురంగును సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆమె నోటి నుంచి నురగలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మాధురి ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.