ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా | Young Woman Protest In front Of Boyfriend House | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

Mar 10 2018 11:18 AM | Updated on Jul 12 2019 3:07 PM

Young Woman Protest In front Of Boyfriend House - Sakshi

శ్రీనివాస్‌ ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న ఆసియా

తిప్పర్తి (నల్లగొండ) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని మల్లెపల్లివారిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు..మండల పరిధిలోని జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధి మల్లెపల్లివారిగూడేనికి చెందిన జంజరాల శ్రీనివాస్‌ ఇదే గ్రామానికి చెందిన ఆసియా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్‌ గ్రామ సమీపంలోని వేబ్రిడ్జిలో పనిచేస్తుండగా, ఆసియా నల్లగొండలో డిగ్రీ పూర్తి చేసింది. శ్రీనివాస్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆసియాను లోబర్చుకున్నాడు. ఇటీవల మరో యువతితో శ్రీనివాస్‌కు నిశ్చితార్థం జరిగింది. తన పరిస్థితి ఏంటని నిలదీయడంతో పెళ్లికి నిరాకరించాడు. బాధితురాలు ఎస్పీని సంప్రదించింది.

దీంతో గత నెల 16న తిప్పర్తి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఈ నెల8వ తేదీన పెళ్లి చేసుకుంటానని శ్రీనివాస్‌ ఒప్పుకున్నాడు.  కానీ బుధవారమే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీం తో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం నిర్వహిస్తానని బాధితురాలు పేర్కొంది. ఆమెకు మద్దతుగా గ్రామస్తులు, పలు రాజ కీయ పార్టీల నాయకులు, ప్రగతి మహిళా మండలి సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. ఆసియాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు మేడిశెట్టి యాదయ్య సంఘీభావం తెలిపారు.   కార్యక్రమంలో ముత్తినేని శ్యామ్, తండు నర్సింహగౌడ్, వనపర్తి నాగేశ్వర్‌రావు, అంజయ్య, జ్యోతి, మల్లేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement