హిజ్రా ఇంట్లో యువకుడి ఆత్మహత్య కలకలం | Young Man Died Suspectedly in Hijra House, Vizag | Sakshi
Sakshi News home page

Apr 15 2018 11:27 AM | Updated on Nov 6 2018 8:50 PM

Young Man Died Suspectedly in Hijra House, Vizag - Sakshi

మృతి చెందిన సురేష్‌కుమార్‌

సాక్షి, చోడవరం (విశాఖ): స్థానిక వెంకన్నపాలెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు.. హిజ్రా ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని మృతి చెందాడు. తన తల్లి పాపలక్ష్మి చిన్నతనంలో వదిలివేయడంతో సంగం సురేష్‌కుమార్‌(18) అనే యువకుడు శివాలయం వీధిలో ఉంటున్న వరసకు పెద్దమ్మ అయిన కర్రిసూరమ్మ వద్ద పెరిగాడు. గాయత్రీ పాన్‌షాప్‌లో ఇతను పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి  11గంటల వరకూ సురేష్‌ ఇంటికి చేరలేదు. దీంతో పెద్దమ్మ నిద్రపోయింది.

విశాఖపట్నం జిల్లా వెంకన్నపాలెంలో నివాసముంటున్న లోవ అనే హిజ్రా తెల్లవారుజామున  తన రూమ్‌కు వెళ్లగా తలుపు లోపల గడి పెట్టి ఉంది. కిటికిలోంచి చూడగా సురేష్‌ ఫ్యాన్‌కి ఉరేసువేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే సురేష్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదనపు ఎస్‌ఐ మునాఫ్, ఏఎస్‌ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు.

గత వినాయక  నవరాత్రుల నుంచి హిజ్రా లోవతో  సురేష్‌కు స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి  వెంకన్నపాలెంలో ఆమె రూమ్‌కు తరుచూ వెళుతున్నాడు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వచ్చి ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇంటర్మీడియెట్‌ వరుకూ చదివిన సురేష్‌ ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచేస్తున్నాడని అతని పెద్దమ్మ సూరమ్మ చెప్పింది. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మునాఫ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement