సీఎంపై అనుచిత వ్యాఖ్యలు | Young Man Comments on CM KCR And Case File | Sakshi
Sakshi News home page

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు

Jun 26 2019 8:00 AM | Updated on Jun 26 2019 11:44 AM

Young Man Comments on CM KCR And Case File - Sakshi

రాంగోపాల్‌పేట్‌: మద్యం మత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్వీ నాయకులు మహంకాళి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న రాత్రి మహంకాళి పోలీసులు ఎస్డీరోడ్‌లోని హాంకాంగ్‌ బజార్‌ వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండగా నల్లగుట్టకు చెందిన ప్రణీత్‌ అనే యువకుడు పట్టుబడ్డాడు. దీంతో అక్కడికి వచ్చిన అతని సోదరుడు ప్రశాంత్‌ మద్యం మత్తులో న్యూసెన్స్‌ చేయడమేగాక ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడాడన్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో మంగళవారం  టీఆర్‌ఎస్‌వీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్వీ నాయకులు మహంకాళి డీఐకి ఫిర్యాదు చేశారు. వీడియోను  తొలగించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంత్‌పై ట్రాఫిక్‌ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు డీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement