తలలేని మహిళ మృతదేహం.. తీవ్ర కలకలం

 Woman Headless Body Found In Kamakhya Temple At Assam - Sakshi

గువాహటి : గువాహాటిలోని నీలాచల్ కొండ ప్రాంతంలో ఉన్న కామాఖ్య దేవీ దేవాలయంలో సమీపంలో తలలేని ఓ మహిళ మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏటా ఇక్కడి ఆలయంలో జరిగే అంబుబాచి పండుగ ఉత్సవంలో భాగంగా మహిళను కొందరు దుండగులు నరబలి ఇచ్చి ఉంటారని, అందులో భాగంగానే మహిళ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. మూఢ నమ్మకాలను నమ్మే దుర్మార్గులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. 

కామాఖ్యా ఆలయం పక్కన ఉన్న బనాదుర్గ దేవాలయం మెట్లపైన ఈ భీకరమైన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంతోపాటు పూజా సామాగ్రి కూడా లభ్యమైంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్‌ మృతదేహం ఉన్న స్థలానికి భద్రత కల్పించారు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు ఇక్కడ జరిగే ఆధ్మాత్మిక  ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయాన్నిమంగళవారం సందర్శించిన విషయం తెలిసిదే.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top