పెద్దమ్మను చితకబాదిన కుమారులు

Woman Brutally Beaten by Her Brother in Laws Sons  - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ మహిళను భర్త సోదరుని కుమారులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని జగత్‌పూరిలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొద్ది రోజుల నుంచి ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదాల్లో పెద్ద అన్న భార్య తలదూర్చింది. దీంతో ఆవేశానికి లోనైన మరిది కుమారులు.. ఆమెను నడిరోడ్డుపై చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top